Friday, June 20, 2008

ఇది సరికొత్త బ్లాగు

నేను సైతం ప్రపంచానికి
బ్లాగునొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం భువన భవనపు
బ్లాగునై పైకిలేస్తాను
నన్నెవ్వరాపలేరీవేళ
నా ఇచ్చయేగాక నాకేటి వెరపు ?
ఎవడాపును ఎవడాపును
పైరగాలి నెవడాపును
తెలుగు బ్లాగునెవడాపును
ప్రపంచ నెటిజనులారా ఏకముకండు
మీకు పోయేదేమీలేదు నంకెళ్ళు తప్ప !
ఇది నవయుగోదయం
సరికొత్త తెలుగు బ్లాగోదయం
తెలుగు పత్రికాబాధితులారా
ఇక ఎంత మాత్రం మీ రచనలు
పత్రికాఫీసులనుండి తిరిగి రానే రావు
మీ బ్లాగే మీ పత్రిక బ్లాగే మీ నిలువుటద్దం
అద్దం అబద్ధం చెప్పదు
రచయితే ప్రచురణకర్త విక్రేత
నా బ్లాగే నా జెండా
నా బ్లాగే నా ఎజెండా
ఇదే నా బ్లాగవతం
నా బ్లాగరతం
నా బ్లామాయణం
నా భ్లాగవద్గీత
నా బ్లాగే నా సామ్రాజ్యం
నా బ్లాగుకు నేనే
ముఖ్యమంత్రిని
ప్రధానమంత్రిని
ఇది నా కవిత్వం కాదు
ఇది నా సంపాదకీయం
నా బ్లాగుకు నేనే సంపాదకురాలిని
ఇక రఫ్ఫాడిస్తా
ఇక బ్లాగాడిస్తా
దేశ బ్లాగులందు
తెలుగుబ్లాగు లెస్స !

8 comments:

sahitheeyanam said...

స్వాగతం.
కవిత్వం బాగా చదివినట్టున్నారె?
పదండి ముందుకు, పదండి తోసుకు. ్

బాక్ గ్రవుండ్ బ్లాక్ గా కాక కొంచెం లైట్ కలర్ ఉంటే బాగుంటుంది.
బొల్లోజు బాబా

Purnima said...

swaagatam.. suswaagatam!!

అన్నమయ్య పలుకుబడులు said...

స్వాగతం. సుస్వాగతం.
చాలా మంచిగ బ్లాగుతున్నారే.
ఇంకా ఇంకా బ్లాగండి.బ్లాగుతు బ్లాగుతు వుండండి.మీ నుండి కవిత్వం నాక్కూడా వచ్చేస్తున్నట్టుంది.

కత్తి మహేష్ కుమార్ said...

ప్రస్తుతానికి స్వాగతం. బ్లగాభివృద్ధిరస్తు!

కామెంట్లకు word verification తీసివేయగలరు.

www.parnashaala.blogspot.com

సుధాకర బాబు said...

స్వాగతం. విజయోస్తు.

meenakshi.a said...

swaagatam suswaagatam.......
kottaga blaagu lokam loki aDugu pettina
nitya gaariki manaspoortigaa ee meenakshi swaagatam palukutundi.

nitya said...
This comment has been removed by the author.
vajasaneya said...

me notinundi ela niratarma blogparayanam jaragalani asistu