Friday, June 20, 2008

ఇది సరికొత్త బ్లాగు

నేను సైతం ప్రపంచానికి
బ్లాగునొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం భువన భవనపు
బ్లాగునై పైకిలేస్తాను
నన్నెవ్వరాపలేరీవేళ
నా ఇచ్చయేగాక నాకేటి వెరపు ?
ఎవడాపును ఎవడాపును
పైరగాలి నెవడాపును
తెలుగు బ్లాగునెవడాపును
ప్రపంచ నెటిజనులారా ఏకముకండు
మీకు పోయేదేమీలేదు నంకెళ్ళు తప్ప !
ఇది నవయుగోదయం
సరికొత్త తెలుగు బ్లాగోదయం
తెలుగు పత్రికాబాధితులారా
ఇక ఎంత మాత్రం మీ రచనలు
పత్రికాఫీసులనుండి తిరిగి రానే రావు
మీ బ్లాగే మీ పత్రిక బ్లాగే మీ నిలువుటద్దం
అద్దం అబద్ధం చెప్పదు
రచయితే ప్రచురణకర్త విక్రేత
నా బ్లాగే నా జెండా
నా బ్లాగే నా ఎజెండా
ఇదే నా బ్లాగవతం
నా బ్లాగరతం
నా బ్లామాయణం
నా భ్లాగవద్గీత
నా బ్లాగే నా సామ్రాజ్యం
నా బ్లాగుకు నేనే
ముఖ్యమంత్రిని
ప్రధానమంత్రిని
ఇది నా కవిత్వం కాదు
ఇది నా సంపాదకీయం
నా బ్లాగుకు నేనే సంపాదకురాలిని
ఇక రఫ్ఫాడిస్తా
ఇక బ్లాగాడిస్తా
దేశ బ్లాగులందు
తెలుగుబ్లాగు లెస్స !